Kingdom: విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌` వాయిదా.. కొత్త డేట్‌ ఇదే

Published : May 14, 2025, 11:47 AM IST
Kingdom: విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌` వాయిదా.. కొత్త డేట్‌ ఇదే

సారాంశం

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కి డిజప్పాయింట్‌ చేసే వార్త వచ్చింది. `కింగ్‌డమ్‌` మూవీ వాయిదా పడింది. ఈ నెల 30న రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నట్టు టీమ్‌ తెలిపింది. కారణం ఏంటంటే?  

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న `కింగ్‌డమ్‌` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్‌ గూస్‌ బంమ్స్ తెప్పించింది. సినిమాలో ఏదో విషయం ఉందనే విషయాన్ని తెలియజేసింది. అంచనాలను మరింతగా పెంచింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి అప్‌ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఆ మధ్య ఓ సాంగ్‌ని విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రౌడీ కమ్‌ బ్యాక్‌ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్‌ చేశారు. 

`కింగ్‌డమ్‌` మూవీ రిలీజ్‌ వాయిదా..

ఇక ఈ మూవీని ఈ నెల 30న విడుదల చేయాలని భావించారు. రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు. కానీ సడెన్‌గా ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. కొత్త డేట్‌ని విడుదల చేశారు. ఈ నెల 30న విడుదల కావాల్సిన ఈ మూవీని జులై 4కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది టీమ్‌. దీనికి కారణాలు కూడా వెల్లడించారు.  

జులై 4న విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌` మూవీ రిలీజ్‌

`మే 30న విడుదల కావాల్సిన మా 'కింగ్‌డమ్‌' సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం 'కింగ్‌డమ్'కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. 

బెస్ట్ ఔట్‌పుట్‌తో `కింగ్‌ డమ్‌` మూవీ విడుదల

కాస్త ఆలస్యంగా వచ్చినా 'కింగ్‌డమ్‌' చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.

విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు, నితిన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము` అని టీమ్‌ తెలిపింది. ఎందుకంటే అదే రోజు నితిన్‌ `తమ్ముడు` చిత్రం కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. 

`కింగ్‌డమ్‌`లో పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో విజయ్‌ దేవరకొండ

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కింగ్‌డమ్' చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

`విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.

జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం 'హృదయం లోపల' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది` అని టీమ్‌ వెల్లడించింది.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం