ఖుషిగా విజయ్ - రష్మిక మందన్న.. ఒకేసారి పోస్టులు.. విషయం ఏంటంటే?

Published : Aug 15, 2023, 07:17 PM ISTUpdated : Aug 15, 2023, 07:18 PM IST
ఖుషిగా విజయ్ - రష్మిక మందన్న.. ఒకేసారి పోస్టులు.. విషయం ఏంటంటే?

సారాంశం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ రోజు వారిద్దరు కలిసి నటించిన చిత్రం ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఆసక్తికరంగా పోస్టులు చేశారు.   

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  ఇద్దరు కలిసి నటించిన తొలిచిత్రం ‘గీతాగోవిందం’. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. విజయ్, రష్మికల పేయిర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

గీతాగోవిందం లాంటి క్లాసికల్ హిట్ విజయ్ దేవరకొండకు ఇప్పటికీ అందలేదు. మరోవైపు రష్మికకు ఈ సినిమా అందించిన సక్సెస్ తన కెరీర్ కు ఎంతో దోహదపడింది. స్టార్ హీరోయిన్ ను చేసిందని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ఆగస్టు 15నే విడుదలైంది. ఇక నేటితో ఈ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా విజయ్, పరుశురామ్ పెట్ల, రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడే ఐదేళ్లు కంప్లీట్ అవడంతో అభిమానులతో ఇలా షేర్ చేసుకున్నారు. 

‘గీతాగోవిందం’ ఐదేళ్లు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ తొలుత ఆసక్తికరంగా పోస్టు పెట్టారు. ‘ఈరోజు చాలా జరుగుతున్నాయి. 1. మనందరికీ స్వాతంత్ర్య దినోత్సవం. 2. గీతా గోవిందం సినిమా ఐదేళ్లు పూర్తైన సందర్భంగా పరుశురామ్ పెట్ల, రష్మిక మందనను కలవడం చాలా సంతోషంగా ఉంది. 3. ఈరోజే ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ కూడా ఉంది.’ అంటూ విజయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా వెంటనే పోస్టు చేసింది. క్యూట్ గా నోట్ రాసుకొచ్చింది. ’మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ‘గీతగోవిందం’ మూవీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు కూడా.. ఈ సినిమాతో వచ్చిన ప్రతిదానికి, ధన్యవాదాలు.. సర్వధా కృతజ్ఞతలు’ అంటూ తన పోస్టులో పేర్కొంది. మొతానికి విజయ్, రష్మిక మందన్న ఒకేచోట చేరి సోషల్ మీడియాలో మెరియడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే