
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాడు. ఆయన నటిస్తున్న వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఆయన చేసిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి... పర్వాలేదు అనిపించింది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ ఎన్నో విమర్షలపాలు అయ్యింది. ఇక నెక్ట్స్ ఫ్యాన్స్ దృష్టంతా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సలార్ పైనే ఉంది. ఇక సలార్ తో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా, అర్జున్ రెడ్డి ఫేమో సందీప్ వంగాతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో మారుతి సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఎలాగో ప్రశాంత్ నీల్ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే మారుతి సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఈమూవీని మారుతి ఎలా డ్రైవ్ చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఈమూవీ నుంచి ఓ భారీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తుండగా.. మరో హీరో కోసం ఇంట్రెస్టింగ్ రోల్ ఉందట. సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసే ఈ పాత్ర ద్వారా చాలా ఫన్ జనరేట్ అవుతుందట. అందుకే, ఈ పాత్రలో ఓ యంగ్ హీరోని తీసుకోవాలి అని అనుకుంటున్నారట. మరి ఈ పాత్రలో ఏ యంగ్ హీరోని తీసుకుంటారో చూడాలి.
అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న కారణంగా.. బాలీవుడ్ నుంచి ఓ హీరోని ఒప్పించాలనేది మారుతి ఆలోచన. మరో వైపు ఇలా హీరో పాత్ర ఫన్ జనరేట్ చేయాలి అంటే.. కామెడీ హీరోను తీసుకుకోవాలి. దాని కోసం జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టిని కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారని సమాచారం. సహజంగా మారుతి అంటేనే.. చిన్న చిన్న పాత్రలతోనే ఫుల్ కామెడీని పండిస్తాడు. మరి ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ కామెడీని పండిస్తాడో చూడాలి.ఈ ఇంట్రెస్టింగ్ రోల్ ద్వారా వచ్చే కామెడీ చాలా ఎంటర్ టైన్ గా ఉంటుందని సమాచారం.
ఇక మరో విషయం ఏంటీ అంటే.. ఈసినిమాకు మొదటి నుంచి రాజా డీలక్స్ అన్న పేరు అనుకుంటున్నారు. కాని ప్రస్తుతం మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. అందులో రాయల్’, ‘అంబాసిడర్’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఐతే, ఇందులో రాయల్ అనే టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి మారుతి ఎలాంటి సినిమా ఇస్తాడో.