విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2018లో వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా చిత్రం రూపొంది విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పీరియాడికల్ డ్రామా రూపొందించబోతున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాల లైనప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 30న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా అతడు నటించబోతున్న మరో చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2018లో వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా చిత్రం రూపొంది విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పీరియాడికల్ డ్రామా రూపొందించబోతున్నారు.
VD14 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.
ఈ సినిమాకు సంబంధించి కథా నేపథ్యం రాజుల కాలాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ప్రీ లుక్ లో విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ పేస్ చూపించకుండా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. యోగాసనంలో కండలు తిరిగిన శరీరంతో వీరుడిలా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కి.. దేవుడు అతడికి బలాన్ని ఇచ్చాడు.. యుద్ధం అతనికి లక్ష్యాన్ని ఇచ్చింది అనే క్యాప్షన్ పెట్టారు.
గతంలో తన రెండో సినిమా శ్యామ్ సింగరాయ్‌కి ముందు కూడా కొంత విరామం తీసుకున్న రాహుల్, ఈ మూడో సినిమా కోసం రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు.
హీరోయిన్ పాత్రకు రష్మిక మంధన్న పేరును పరిశీలిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, చిత్రబృందం నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అదే విధంగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి కూడా విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి సంబందించిన ప్రకటన వచ్చింది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.