బ్రెయిన్ క్యాన్సర్ తో 'ఫిఫ్టీ షేడ్స్' మూవీ డైరెక్టర్ జేమ్స్ ఫోలీ మృతి

Published : May 09, 2025, 12:07 PM IST
బ్రెయిన్ క్యాన్సర్ తో 'ఫిఫ్టీ షేడ్స్' మూవీ డైరెక్టర్ జేమ్స్ ఫోలీ మృతి

సారాంశం

ప్రఖ్యాత అమెరికన్ దర్శకుడు జేమ్స్ ఫోలీ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త హాలీవుడ్ ని విషాదంలో ముంచింది. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిద్రలోనే మృతి చెందారు.

ప్రఖ్యాత అమెరికన్ దర్శకుడు జేమ్స్ ఫోలీ (James Foley) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త హాలీవుడ్ ని విషాదంలో ముంచింది. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిద్రలోనే మృతి చెందారు. ఆయన వయసు 71 ఏళ్ళు. ఈ విషయాన్ని ఫోలీ ప్రతినిధి ఒక ప్రకటనలో ధృవీకరించారు. "అయన గత కొన్ని సంవత్సరాలుగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు," అని హాలీవుడ్ మీడియాకి ప్రతినిధి తెలిపారు.

డిసెంబర్ 28, 1953న న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్‌లో జన్మించిన ఫోలీ, 1984లో విడుదలైన 'రెక్లెస్ ' సినిమాతో తన దర్శక జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1986లో విడుదలైన 'ఎట్ క్లోజ్ రేంజ్' సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో శాన్ పెన్ మరియు క్రిస్టఫర్ వాకెన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఫోలీ దర్శకత్వంలో రూపొందిన ముఖ్యమైన చిత్రాలలో 1992లో వచ్చిన ' గ్లెన్‌గారీ గ్లెన్ రాస్ , 1996లో వచ్చిన సైకాలజికల్ థ్రిల్లర్ 'ఫియర్' చిత్రాలని తెరకెక్కించారు. రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కిన ఫిఫ్టీ షేడ్స్ సిరీస్ తో కూడా ప్రేక్షకులని అలరించారు.  2017, 2018లో విడుదలైన రొమాంటిక్ డ్రామాలు 'ఫిఫ్టీ షేడ్స్ డార్కర్' మరియు 'ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ ' చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. 

టెలివిజన్ రంగంలో కూడా ఫోలీ విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'హౌస్ ఆఫ్ కార్డ్స్''ట్విన్ పీక్స్' వంటి ప్రఖ్యాత సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించారు.

సంగీత వీడియోల రంగంలో కూడా ఫోలీ తన ముద్ర వేశారు. మడోన్నాకు సంబంధించిన ప్రసిద్ధ మ్యూజిక్ వీడియోలు ‘లివ్ టూ టెల్’ ఆయన దర్శకత్వంలో రూపొందాయి.ఫోలీ కన్ను మూసినప్పటికీ, ఆయన సినిమాల కృషి, సృజనాత్మకతను సినీ ప్రపంచం మరచిపోలేదు. ఆయనకు సోదరులు సోదరీమణులు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?