ఆ పొలిటికల్ పార్టీకి విజయ్ దేవరకొండ సపోర్ట్!

Published : Sep 24, 2018, 12:39 PM IST
ఆ పొలిటికల్ పార్టీకి విజయ్ దేవరకొండ సపోర్ట్!

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడి సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. 'గీత గోవిందం' సినిమాతో ఘన విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'నోటా' ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. 

తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిజంగానే ఓ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట చిత్రబృందం.

తమిళనాడు డిఎంకె పార్టీని సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ తెరపై రాజకీయాల పరంగా కొంతవరకు స్టాలిన్ పాత్రను పోట్రెట్ చేశారని టాక్. తమిళనాడు ఇలా రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తూ సినిమాలు రావడం కొత్తేమీ కాదు.

కానీ తెలుగు ఆడియన్స్ కి ఈ తమిళ రాజకీయాల రుచి ఎంతవరకు నచ్చుతుందనేది చెప్పలేని పరిస్థితి. మరి విజయ్ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్