టీజర్: అమర్ అక్బర్ అంథోని.. అంచనాలను పెంచేస్తున్నారు!

Published : Sep 24, 2018, 12:35 PM ISTUpdated : Sep 24, 2018, 12:39 PM IST
టీజర్: అమర్ అక్బర్ అంథోని.. అంచనాలను పెంచేస్తున్నారు!

సారాంశం

నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ పివోట్ పేరుతో ఒక టీజర్ ను రీలిజ్ చేసింది. రవి తేజ అమర్ - అక్బర్ - అంథోని పాత్రలను విజువల్ గా ఆకట్టుకునే విధంగా తెరక్కించారని అర్ధమవుతోంది. మొదటి పాత్రలో రవితేజ అమెరికన్ జైల్లో ఖైదీగా కనిపిస్తున్నాడు. 

పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. గత కొంత కాలంగా ఊహించని విధంగా అపజయాలను ఎదుర్కొంటున్న ఈ దర్శకుడు ఈ సారి కొంచెం వెరైటీ ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. రవితేజ కథానాయకుడిగా మూడు విభిన్న పాత్రలతో శ్రీను వైట్ల  తెరకెక్కిస్తున్న చిత్రం అమర్ అక్బర్ అంథోని.

నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ పివోట్ పేరుతో ఒక టీజర్ ను రీలిజ్ చేసింది. రవి తేజ అమర్ - అక్బర్ - అంథోని పాత్రలను విజువల్ గా ఆకట్టుకునే విధంగా తెరక్కించారని అర్ధమవుతోంది. మొదటి పాత్రలో రవితేజ అమెరికన్ జైల్లో ఖైదీగా కనిపిస్తున్నాడు. టీజర్ ని చూస్తుంటే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా థమన్ ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. 

ట్రైలర్ పై కూడా ఈ పివోట్ అంచనాలను పెంచిందని చెప్పవచ్చు. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఎండింగ్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. ఇక  ఇలియానా సినిమాలో కథానాయిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.  

 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్