వీడియో: హాలీవుడ్ చిత్రానికి విజయ్ దేవరకొండ వాయిస్

Surya Prakash   | Asianet News
Published : Aug 22, 2021, 09:14 AM IST
వీడియో: హాలీవుడ్ చిత్రానికి విజయ్ దేవరకొండ వాయిస్

సారాంశం

త్వరలోనే పూరి జగన్నాథ్ దర్శత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాతో హిందీ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నారు.  నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం హాలీవుడ్ సినిమాకు కూడా వర్క్ చేసాడు.  


విజయ్ దేవరకొండ మొదటిసారి ఒక హాలీవుడ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. అయితే అతను వెండితెరపై కనిపించడు. తన వాయిస్ వినిపిస్తుంది.  విజయ్ దేవరకొండ మొదటి నుంచీ సెన్సేషనే. వరస హిట్లే. సినిమా సినిమాకు తన స్థాయిని, బిజినెస్ ని పెంచుకునే విధంగానే అడుగులు వేస్తున్నాడు.  త్వరలోనే పూరి జగన్నాథ్ దర్శత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాతో హిందీ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నారు.  నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం హాలీవుడ్ సినిమాకు కూడా వర్క్ చేసాడు.  ఆవివరాలేంటో చూద్దాం.

 విజయ్ దేవరకొండ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‌ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఆ సినిమాకు సరపడే నేరషన్  తో బ్యాక్ స్టోరీని వివరిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఒక ప్రోమోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు త్వరలో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఆ బిగ్ మాన్ స్టర్ యాక్షన్ మూవీని ఓటీటీ వరల్డ్ లో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. మీ బీస్ట్ బాయ్ ‘లెజెండ్స్ ఆఫ్ ది మాన్‌స్టర్‌వర్స్’ నేరేటర్‌గా వస్తున్నాడు.. గాడ్జిల్లా వర్సెస్ కింగ్, ప్రైమ్‌తో ఫన్ కొలాబొరేషన్’ అని విజయ్ వీడియో షేర్ చేసారు.

మరో ప్రక్క మహానటి హీరో ..దుల్కర్ సల్మాన్‌లు అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్’ యానిమేటెడ్ వీడియో ‘లెజెండ్స్ ఆఫ్ ది మాన్‌స్టర్‌వర్స్’కు ప్రాంతీయ భాషల్లో నేరేషన్ ఇచ్చారు. విజయ్ తెలుగులో స్టోరీని నేరేట్ చేయగా.. దుల్కర్ తమిళ్‌లో కథను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. రెండు ప్రాణాంతక రాక్షసులు గాడ్జిల్లా, కాంగ్‌ల మధ్య పోటీ, ఇతిహాసం గురించి ఈ వీడియోలో వివరించగా అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే అవకాశాలు ఉన్నాయి. ‘టక్ జగదీష్’ దర్శకుడు శివనిర్వాణతో సినిమా కూడా అలాగే చేయాలని భావిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?