
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషనల్ లో తొలిసారిగా రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ గా Liger తెరకెక్కుతోంది. తెలుగు, హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ చార్మి కౌర్, కో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే (Ananya Panday) ఆడిపాండి. అలాగే రోణిత్ రాయ్, రమ్యక్రిష్ణ, అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) పలు కీలక పాత్రలో నటించారు.
అయితే, ఈ రోజు మైక్ టైన్ 56వ పుట్టిన రోజు సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే విషెస్ తెలిపారు. టైసన్ ను కొనియాడుతూ.. ఇంట్రెస్టింగ్ నోట్ కూడా రాశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మైక్ టైసన్. నేను మిమ్మల్ని కలవాలని కలలో కూడా అనుకోలేదు. మీతో నేను చేసిన అన్ని పనులను మరచిపోయాను. మీరు నా జీవితానికి ఒక జ్ఞాపకం’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని వదిలారు. అలాగే లైగర్ టీం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు అలాగే చార్మి కౌర్ కూడా మైక్ టైసన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.
అమెరికాకు చెందిన మైక్ టైసన్ పూర్తి పేరు మైఖేల్ గెరార్డ్ టైసన్. ఈయన జూన్ 30, 1966లో జన్మించాడు. టైసన్ అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ గా 1985 నుండి 2005 వరకు పోటీపడ్డాడు. అతని కెరీర్ ప్రారంభంలో ‘ఐరన్ మైక్’, ‘కిడ్ డైనమైట్’ అనే నేమ్ ట్యాగ్ ను పొందారు. ఆ తర్వాత ఆయన కేరీర్ వెళ్తున్న తీరును బట్టి ‘ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్’ అనే టైటిల్ తోనూ కొందరూ పిలిచారు. టైసన్ హెవీవెయిట్ బాక్సర్‌లలో ఒకడిగా చోటు సంపాదించుకున్నాడు. 1987 నుండి 1990 వరకు తిరుగులేని ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌గా రాణించాడు టైసన్. ‘లైగర్’ సినిమాతో టైసన్ తొలిసారిగా ఇండియన్ సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నాడు.