మరోసారి ముద్దులతో రెచ్చిపోనున్నారా..?

Published : Mar 07, 2019, 03:38 PM IST
మరోసారి ముద్దులతో రెచ్చిపోనున్నారా..?

సారాంశం

'అర్జున్ రెడ్డి' సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. 

'అర్జున్ రెడ్డి' సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

ఈ సినిమాతో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండేని తీసుకున్నారని సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం విజయ్, షాలినిల మధ్య కెమిస్ట్రీ అనే చెప్పాలి.

తెరపై వీరిమధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో చూపించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. రొమాన్స్ కి కూడా ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

ఆ సన్నివేశాల్లో విజయ్, షాలిని పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్. సినిమాలో మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ అనే మలయాళీ నటి కనిపించనుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌