నిఖిల్ 'శ్వాస' ఆగిపోయింది!

Published : Mar 07, 2019, 03:11 PM IST
నిఖిల్ 'శ్వాస' ఆగిపోయింది!

సారాంశం

యంగ్ హీరో నిఖిల్ సరికొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు 'అర్జున్ సురవరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

యంగ్ హీరో నిఖిల్ సరికొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు 'అర్జున్ సురవరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత నిఖిల్ 'శ్వాస' అనే సినిమాలో నటించడానికి అంగీకరించాడు. నివేదా థామస్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కిషన్ కట్టా దర్శకుడు. తేజ్ ఉప్పలపాటి, హరికిషన్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు.

థ్రిల్లర్ నేపధ్యంలో సాగే కథ. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా వదిలారు. పోస్టర్ ఆసక్తికరంగా ఉండడంతో మరో హిట్ కొట్టేలా ఉన్నాడని అనుకున్నారు. అయితే ఈ సినిమాకి ఎక్కడ సమస్యవచ్చిందో కానీ మొత్తానికి సినిమా మాత్రం ఆగిపోయింది.

ఆ కారణంగా ఇప్పుడు నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే