బ్రాండ్ అంబాసిడర్  అవతారమెత్తిన విజయ్ దేవరకొండ

Published : Sep 16, 2017, 02:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
బ్రాండ్ అంబాసిడర్  అవతారమెత్తిన విజయ్ దేవరకొండ

సారాంశం

అర్జున్ రెడ్డి  తో క్రేజీ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న విజయ్  ప్రముఖ ఫ్యాషన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్

అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవర కొండ. ఆ సినిమా భారీ విజయంతో.. ఆయన సినిమా అవకాశాలతో పాటు ప్రకటనలు కూడా క్యూ కడుతున్నాయి. ఆయన తొలిసారిగా ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు.

 

ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర సంస్థ కే.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ తొలి సంతకం చేశారు. ఈ ఫ్యాషన్ మాల్ త్వరలోనే జంట నగరాల్లో ప్రారంభించనున్నారు. ఆ కంపెనీ తరపున విజయ్.. ప్రచారం చేయనున్నారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ వేదికగా జరిగిన పాత్రికేయ సమావేశంలో కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ డైరక్టర్ కళ్యాణ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


ఈ సందర్భంగా సంస్థ డైరక్టర్ కళ్యాణ్ అన్నం మాట్లాడుతూ, "ఇప్పటికే కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, ఆర్ బ్రాండ్లతో 26 బ్రాంచులతో, 3000 మంది ఉద్యోగులతో గత 12 ఏళ్లుగా నిర్విరామ కృషితో లక్షలాది మంది వినియోగదారులకి దగ్గరయ్యాం. ఇప్పుడు అతి తక్కువ ధరలతో అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్స్ ను హైదరాబాద్ వాసులకి అందించే ఆలోచనతో ఈ కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ ను స్థాపించాం. ప్రస్తుత తరం యువతకి ఐకాన్ గా నిలిచిన విజయ్ దేవరకొండగారిని మా కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం" అన్నారు.

కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ లోగో ని, టీ.వీ యాడ్ ని  విజయ్ ఈ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ  "కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు కొత్త బాధ్యత. త్వరలోనే కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాషన్ కి చిరునామాగా మారుతుందని ఆశిస్తున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ మరో డైరక్టర్ చలవాది మోహన్ కూడా పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?