ఏడు లక్షలు దోచుకున్న దుండగులు నాపై లైంగిక దాడి చేస్తే పరిస్థితి ఏంటీ?, నటికి షాకింగ్ అనుభవం

Published : Sep 15, 2021, 03:08 PM IST
ఏడు లక్షలు దోచుకున్న దుండగులు నాపై లైంగిక దాడి చేస్తే పరిస్థితి ఏంటీ?, నటికి షాకింగ్ అనుభవం

సారాంశం

బాలీవుడ్ నటి నిఖిత రావల్ ఇటీవల తనకు ఎదురైన భయానక సంఘటన గురించి, మీడియాతో పంచుకొని ఆవేదన చెందారు.

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. బాలీవుడ్ నటి నిఖిత రావల్ ఇటీవల తనకు ఎదురైన భయానక సంఘటన గురించి, మీడియాతో పంచుకొని ఆవేదన చెందారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించి, తన వద్ద నుండి రూ. 7లక్షల విలువైన ఆభరణాలు, వస్తువులు దోచుకున్నట్లు వెల్లడించారు. 

''ఢిల్లీలో ఓ మూవీ షూటింగ్‌ కోసం అక్కడే ఉంటున్న మా బంధువుల ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో మా ఆంటి ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఓ రోజు షూటింగ్‌ ముగిశాక రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్నా. మా ఇంటికి సమీపంలోకి రాగానే ఓ ఇన్నోవా కారు వేగంగా నా వైపుకు వచ్చి ఆగింది. వెంటనే కారులోంచి నలుగురు వ్యక్తులు బయటకు దిగారు. వారంతా నల్లటి మాస్క్‌లు ధరించి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తుపాకి నా తలకు గురి పెట్టి నా దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇవ్వమని బెదిరించాడు. ఆ సయమంలో నా ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, వాచ్‌, డైమండ్‌ పెండెంట్‌, డబ్బులను లాక్కెళ్లారు’' అని నిఖిత రావల్ వివరించారు. 

ఆ సంఘటన షాక్  నుండి దాదాపు పది నిముషాలు నేను తేరుకోలేదని, నటి నిఖిత తెలిపారు. ఆభరణాలతో పాటు వాళ్ళు నాపై లైంగిక దాడి చేసినా, తుపాకీతో షూట్ చేసినా నా పరిస్థితి ఏమిటని తలచుకొని, ఇప్పటికీ భయపడుతున్నాని నిఖిత, ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా