మహేష్ ని 'సర్' అని పిలవడం కష్టంగా ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : May 01, 2019, 09:42 PM ISTUpdated : May 01, 2019, 10:16 PM IST
మహేష్ ని 'సర్' అని పిలవడం కష్టంగా ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు.

ఈ సంధర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''మహేష్ బాబు గారికి నేను పెద్ద అభిమానిని. కాలేజ్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు యాక్టర్ అయిన తరువాత మహేష్ సర్ ని పిలవాల్సి వస్తుంది. మనవాడు అనుకునేవాళ్లం.. ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సివస్తోంది.. అప్పుడప్పుడు మహేష్ అని  వచ్చేస్తుంది(నవ్వుతూ).. మురారి సినిమా నుండి ఆయన్ని ఫాలో అవుతున్నాను. అలాంటి హీరో నా సినిమాలకు ట్వీట్ వేయడం సంతోషంగా అనిపించింది. ఈ 
సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఆరోజు నా పుట్టినరోజు.. ఆరోజు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. 

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 4 )

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 3 )

మహర్షి ఈవెంట్.. నరేష్ సింపుల్ కామెంట్స్!

మహర్షి ట్రైలర్: ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా

 

PREV
click me!

Recommended Stories

Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని