మహర్షి ఈవెంట్.. నరేష్ సింపుల్ కామెంట్స్!

Published : May 01, 2019, 08:58 PM IST
మహర్షి ఈవెంట్.. నరేష్ సింపుల్ కామెంట్స్!

సారాంశం

మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో ఈవెంట్ కు భారీ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అయితే సినిమాలో కీలకపాత్రలో నటించిన అల్లరి నరేష్ ఎలాంటి ఆర్బాటం లేకుండా సింపుల్  గా తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.   

మహర్షి ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో ఈవెంట్ కు భారీ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అయితే సినిమాలో కీలకపాత్రలో నటించిన అల్లరి నరేష్ ఎలాంటి ఆర్బాటం లేకుండా సింపుల్  గా తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.   

నరేష్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు 25వ చిత్రంలో నటించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినిమాను నిర్మించిన ముగ్గురి నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడే సినిమా గురించి ఏమీ చెప్పలేను. 

సక్సెస్ మీట్ లోనే అన్ని మాట్లాడతా. మహేష్ బాబు 25వ సినిమా మహర్షి తప్పకుండ బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది. నన్ను కామెడీ యాంగిల్ లోనే కాకుండా కొంచెం సీరియస్ యాంగిల్ లో కూడా చూపించారు. ఇంత మంచి క్యారెక్టర్ కోసం నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశి గారికి కృతజ్ఞతలని నరేష్ మిగతా విషయాలన్నీ సక్సెస్ మీట్ లో చెబుతానని స్పీచ్ ను ముగించారు. 

PREV
click me!

Recommended Stories

Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని