చిన్న సినిమా వేడుకలో రౌడీ స్టార్

Published : Aug 17, 2019, 05:14 PM IST
చిన్న సినిమా వేడుకలో రౌడీ స్టార్

సారాంశం

సుడిగాడు వంటి కామెడీ సినిమాతో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఇప్పుడు మరో స్పెషల్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కణా సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.   

ఈ నెల 23న సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ రానున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని జెఆర్సీ బాల్ రూమ్ లో ఈవెంట్ కు వేదిక సిద్ధమైంది., సాయంత్రం నాలుగు గంటలకే ఈవెంట్ స్టార్ట్ కానుంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలతో కౌసల్య కృష్ణమూర్తి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రౌడీ స్టార్ తో సినిమా క్రేజ్ ను మరింతగా పెంచాలని చిత్ర యూనిట్ సిద్ధమైంది. కెఏ వల్లభ నిర్మించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ - ఐశ్వర్య రాజేష్ - శివ క్లార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించారు.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి