'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

By Udayavani DhuliFirst Published Aug 21, 2018, 10:41 AM IST
Highlights

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలో కొన్ని సన్నివేశాలు రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. అయినప్పటికీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలో కొన్ని సన్నివేశాలు రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. అయినప్పటికీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. సీన్స్ లీకైనా సినిమా విజయం సాధించడం పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకి మరో షాక్ తగిలింది. తను నటించిన 'టాక్సీవాలా' సినిమా వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. అయితే ఎడిటింగ్ కూడా పూర్తికాక ముందే ఈ సినిమా హెచ్ డి ప్రింట్ నెట్ లో వైరల్ అవుతోంది. ఇది గమనించిన చిత్ర నిర్మాతలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో సినిమాను అప్లోడ్ చేశారు.

ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ అధీనంలో ఉన్న యాంటీ వీడియో పైరసీ సెల్ కి ఫిర్యాదు చేశామని, వారి ద్వారా కీలక సమాచారం సేకరించామని నిర్మాణ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీమెయిల్ ఐడీలకు సంబంధించిన గూగుల్ డ్రైవ్ నుండి సినిమా షేర్ అవుతుందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. విజయ్ సినిమాకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి ఈ పైరసీ నుండి సినిమా సేవ్ అవుతుందో లేదో చూడాలి!

click me!