
గీత గోవిందం సినిమాతో పూర్తిగా బాక్స్ ఆఫీస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ నెక్స్ట్ మరో బాక్స్ ఆఫీస్ పై కన్నేశాడు. తెలుగు -తమిళ్ లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నోటా త్వరలోనే రిలీజ్ కానుంది. తెలుగు స్టేట్స్ పొలిటికల్ టచ్ సినిమా కథలో ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ ఒక పొలిటిషియన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే సినిమాను వరల్డ్ వైడ్ గా నవంబర్ 5న రిలీజ్ చెయ్యాలని నిర్మాత కె.ఈ.జ్ఞాన్ వెళ్ రాజా సన్నాహకాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి సినిమా విడుదల కానుంది. ఇకపోతే యూఎస్ ప్రీమియర్స్ నవంబర్ 4న ప్రదర్శించనున్నారు. విజయ్ దేవరకొండ తమిళ్ లో కూడా డబ్బింగ్ చెప్పడం విశేషం. తమిళ ప్రేక్షకుల్లో కూడా సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.
ఇక విజయ్ కు జోడిగా సినిమాలో మెహ్రీన్ పిర్జాద నటించింది. ఫ్రీజ్ ఫ్రెమ్ ఫిలిమ్స్ యుఎస్ లో సినిమాను రిలీజ్ చేస్తోంది. విజయ్ గత సినిమాలు ఓవర్సీస్ లో మంచి లాభాలను అందుకున్నాయి. దీంతో నోటాను ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక సత్యరాజ్ - నాజర్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.