విజయ్ దేవరకొండ కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్!

Published : May 22, 2019, 08:37 AM ISTUpdated : May 22, 2019, 08:38 AM IST
విజయ్ దేవరకొండ కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్!

సారాంశం

వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ డియర్ కామ్రేడ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తోన్న మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ యువ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు

వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ డియర్ కామ్రేడ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తోన్న మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ యువ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా సినిమాకి సరికొత్త వేరియేషన్స్ చూపిస్తోన్న విజయ్, క్రాంతి మాధవ్ సినిమాలో బ్రేకప్ బాయ్ గా కనిపిస్తాడట. 

వివిధ దారుల్లో కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ బాదితుడిగా మిగిలిపోతాడట. అందుకే సినిమాకు కూడా బ్రేకప్ అనే టైటిల్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉంటుందని సమాచారం. రాశి ఖన్నా - విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్ హైలెట్ అని టాక్ వస్తోంది. 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రాశిఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా జులై 26న తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?