ఆర్.నారాయణమూర్తి కోసం రూల్స్ ని పక్కనెట్టిన మెగాస్టార్

By Prashanth MFirst Published 22, May 2019, 7:43 AM IST
Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆర్.నారాయణమూర్తి కోసం తన రూల్స్ ని సైతం పట్టించుకోలేదు.  63 ఏళ్ల మెగాస్టార్ ఫిట్ నెస్ కోసం ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆర్.నారాయణమూర్తి కోసం తన రూల్స్ ని సైతం పట్టించుకోలేదు.  63 ఏళ్ల మెగాస్టార్ ఫిట్ నెస్ కోసం ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాంటిది ముర్తన్న మీద గౌరవంతో పకోడీ తినేశారు. వినడానికి ఇది సింపుల్ గానే ఉన్నా సోషల్ మీడియాలో అందుకు సంబందించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

బయటకి వెళ్లారంటే ఎంత ఆకలిగా ఉన్నా కూడా ఏమి తినరు. అంతగా డైట్ మెయింటైన్ చేసే మెగాస్టార్ తో పీపుల్స్ స్టార్ పకోడి తినిపించి ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళితే. ఆర్.నారాయణమూర్తి లేటెస్ట్ చిత్రం మార్కెట్ లో ప్రజాస్వామ్యం ఆడియో వేడుక హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో జరిగింది.

ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా వెళ్లారు. అయితే అక్కడికి వచ్చిన అతిధులకు స్నాక్స్ ఇస్తున్నారు. ఈ సమయంలో నారాయణమూర్తిని చిరంజీవికి పకోడీ ఇచ్చారు. ఆయన తినే వరకు పక్కనే ఉన్నారు. ఈ దృశ్యమంతా అక్కడ ఉన్న వారికి సరికొత్త .అనుభూతిని ఇచ్చింది. ఫై స్టార్ రేంజ్ లో ఫుడ్ మెయింటైన్ చేసే మెగాస్టార్ ఇలా ముర్తన్న ఆప్యాయంగా ఇచ్చిన పకోడీని తినడం విశేషం..  

Last Updated 22, May 2019, 7:46 AM IST