నిర్మాత విజయ్.. హీరో పెళ్లి చూపులు డైరెక్టర్!

By Prashanth MFirst Published Oct 15, 2018, 2:45 PM IST
Highlights

వరుసగా విజయాలను అందుకొని యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. నోటా సినిమా తన స్పీడ్ కి కొంచెం బ్రేక్ వేసినప్పటికీ నెక్స్ట్ సినిమాలతో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. 

వరుసగా విజయాలను అందుకొని యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. నోటా సినిమా తన స్పీడ్ కి కొంచెం బ్రేక్ వేసినప్పటికీ నెక్స్ట్ సినిమాలతో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. అయితే నోటాతో విజయ్ తన సొంత ప్రొడక్షన్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. 

కింగ్ ఆఫ్ ది హిల్స్ పేరుతో వచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి విజయ్ మొదట యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడు. తనకు పెళ్లి చూపులు లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ నే కథానాయకుడిగా పరిచయం చేయనున్నాడు ఈ హీరో. శమీర్ అనే యువకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 

చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నప్పటికీ పట్టాలెక్కడం లేదు. ఇక ఫైనల్ గా విజయ్ ముందుకు రావడంతో వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. తరుణ్ భాస్కర్ ఇంతకుముందు మహానటి సినిమాలో సింగీతం శ్రీనివాసరావు గారి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

click me!