
డిఫరెంట్ సబ్జెక్ట్స్... డిఫరెంట్ మూవీస్ ను సెలక్ట్ చేసుకుంటూ.. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించాడు శ్రీవిష్ణు. తెలుగు సినీమా రంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. సక్సెస్ పెయిల్యూర్ తో సంబంధంలేకుండా.. తన మార్క్ సెలక్షన్ తో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో గుర్తుండిపోయే సినిమాలు చేస్తుననాడు యంగ్ హీరో.
ఇక శ్రీవిష్ణు నటించిన స్పెషల్ మూవీ భళా తందనాన. చైతన్య దంటులూరి దర్శకడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా టైటిల్ తోనే శ్రీవిష్ణు మార్క్ ను చూపిస్తోంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దాంతో ప్రమోషన్లను షురూ చేశారు మూవీ టీమ్. అందులో భాగంగానే భళా తందనాన మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ట్రైలర్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.
తన పేరు శశిరేఖ.. ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్. తనదో అందమైన ప్రపంచం, కానీ ఎప్పుడు ప్రమాదమైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జర్నలిస్టుగా ఎన్నో స్టోరీస్ కవర్ చేసింది. ఎన్నో నిజాలు బయటపెట్టింది అంటూ విష్ణు వాయిస్ తో స్టార్ట్ అవుతుంద ట్రైలర్ .. ఇందులో హీరోయిన్ కేథరీన్ పాత్ర ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్పాడు హీరో. ఆ రెండు వేల కోట్ల నిజం నా జీవితమైపోయింది. ఆశ డబ్బు కన్నా చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఆకట్టుకునే డైలాగ్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఎప్పటిలాగానే యంగ్ హీరో శ్రీ విష్ణు ఈ సారి కూడా డిఫరెంట్ యాంగిల్ లో ఆలోచించాడు. విభిన్న కథతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అయితే ఈసారి మాత్రం కొంచెం కమర్షియల్ హంగులను జోడించాడు.
వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రాపాటి నిర్మించిన ఈసినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా కేథరీన్ థెరిస్సా నటించింది. కేజీఎఫ్ ఫేం గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాపై ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మే 6న మరికొన్ని సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. అన్నింటిని దాటుకుని శ్రీవిష్ణు సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.