మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌కి ఆఫర్‌

Published : Sep 06, 2021, 05:46 PM IST
మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌కి ఆఫర్‌

సారాంశం

ఇండియన్‌ ఐడల్‌-2021 సీజన్‌ ఫైనల్‌ వరకు వెళ్లి తెలుగు వారి సత్తా చాటిన షణ్ముఖ ప్రియాకి.. విజయ్‌ దేవరకొండ ఆఫర్‌ ఇచ్చాడు. తాను నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌`లో ఓ పాట పాడే అవకాశాన్ని ఇచ్చాడు. 

విజయ్‌ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. సింగర్‌కి తన సినిమాలో పాట పాడే ఆఫర్‌ ఇస్తానని ఇటీవల చెప్పిన ఆయన తాజాగా తన మాటని నిలబెట్టుకున్నారు. ఇండియన్‌ ఐడల్‌-2021 సీజన్‌ ఫైనల్‌ వరకు వెళ్లి తెలుగు వారి సత్తా చాటిన షణ్ముఖ ప్రియాకి.. విజయ్‌ దేవరకొండ ఆఫర్‌ ఇచ్చాడు. తాను నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌`లో ఓ పాట పాడే అవకాశాన్ని ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఇండియన్‌ ఐడల్‌ 12వ సీజన్‌లో తెలుగు రాష్ట్రాలకి చెందిన షణ్ముఖ ప్రియా ఫైనల్‌ వరకు వెళ్లింది. 

ఈ సందర్భంగా ఆమెని సపోర్ట్ చేస్తూ విజయ్‌ దేవరకొండ ఓ వీడియోని విడుదల చేశారు. ఇండియన్‌ ఐడల్‌లో కప్‌ గెలవాలని విషెస్‌ తెలిపారు. గెలినా, ఓడిన తాను తిరిగి హైదరాబాద్‌ వచ్చాక తన సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తానని చెప్పాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది షణ్ముఖ ప్రియా. అన్నట్టుగానే తన మాట నిలబెట్టుకున్నాడు విజయ్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `లైగర్‌`లో ఓ పాట పాడే అవకాశం ఇచ్చాడు.

పాట రికార్డింగ్‌ కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ అప్‌కమింగ్‌ సింగర్‌ షణ్ముఖని ఇంటికి పిలిపించి మరీ సత్కరించారు. వారితో కాసేపు ముచ్చటించారు. అభినందనలు తెలిపాడు. అయితే విజయ్‌ని చూసి ఆనందంతో ఎగిరి గంతేసింది షణ్ముఖ ప్రియ. ఈ సందర్భంగా పంచుకున్న వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. పూరీ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న `లైగర్‌`లో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ తెలుగు, హిందీలో నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది