రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

Published : Oct 01, 2018, 04:57 PM IST
రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం 'నోటా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం 'నోటా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. విజయ్ కి యూత్ లో ఉన్న క్రేజ్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల మార్క్ ని టచ్ చేయడంతో అతడు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని.. నిర్మాతలు కూడా అతడు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ వార్తలు ఖండించాడు విజయ్. తను తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే విషయాన్ని చెప్పనప్పటికీ పారితోషికం పెంచారనే వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు. ఏ సినిమా కోసమైనా ఇదే ఆఖరి సినిమా అన్నట్లుగా పని చేస్తానని, దేనికి ప్లాన్ చేసుకొని, డబ్బులు డిమాండ్ చేయడం లేదని అన్నాడు.

ఇక తన పేరు ముందు స్టార్ ట్యాగ్ ఏదైతే బాగుంటుందో ప్రేక్షకులే నిర్ణయించాలని అన్నాడు. రొటీన్ గా కాకుండా.. 'రాజాధిరాజా' వంటి ట్యాగ్ లు బాగుంటాయేమోనని చమత్కరించాడు. 

PREV
click me!

Recommended Stories

Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్