రాంచరణ్ సీడీ ఇచ్చి చూడమన్నాడు.. నాన్న చెప్పుతో కొడతా అన్నారు!

By Siva KodatiFirst Published May 14, 2019, 7:55 AM IST
Highlights

మెగా హీరో అల్లు శిరీష్ త్వరలో ఎబిసిడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్. మే 17న ఈ చిత్రం విడుదల కానుంది.

మెగా హీరో అల్లు శిరీష్ త్వరలో ఎబిసిడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్. మే 17న ఈ చిత్రం విడుదల కానుంది. గౌరవం చిత్రంతో హీరోగా పరిచయం అయిన శిరీష్ శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. రాజీవ్ రెడ్డి దర్శకత్వంలో, మధుర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మధుర శ్రీధర్ రెడ్డి ఎబిసిడి చిత్రాన్ని నిర్మించారు. సోమవారం రోజు ఎబిసిడి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా ఆహాజరయ్యాడు. 

అల్లు శిరీష్ మాట్లాడుతూ ఎబిసిడి గురించి ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ వల్లే తాను ఈ చిత్రంలో నటిస్తున్నానని శిరీష్ తెలిపాడు. తదుపరి ఎలాంటి చిత్రం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో రాంచరణ్ నాకు ఎబిసిడి గురించి చెప్పాడు. ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. ఈ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుంది.. ఒకసారి చూడు అని ఎబిసిడి  మలయాళం సీడీ ఇచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడే ఎబిసిడి రీమేక్ చేయాలని నిర్మించనుకున్నట్లు శిరీష్ తెలిపాడు. 

ఈ చిత్రంలో తాను పోషించిన పాత్ర నిజజీవితంలో 21 ఏళ్ల వయసులో ఎదురైంది. ఆ వయసులో డబ్బు విలువ తెలియకుండా నిర్లక్ష్యంతో ఉన్నాను. బన్నీకి 21 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నాన్న కొత్త కారు కొనిచ్చారు. అదే వయసులో చరణ్ కు కూడా కొత్త కారు వచ్చింది. 21 ఏళ్ళు నిండగానే కొత్తకారు కావాలని నాన్నని అడిగా. ఏకంగా కాస్ట్లీ స్పోర్ట్స్ కారు డిమాండ్ చేశా. నాన్న వెంటనే చెప్పుతో కొడతా అన్నారు. 

నీ వయసు కుర్రాళ్లంతా బస్సుల్లో, బైకులపై తిరుగుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం డబ్బు విలువ తెలియకుండా స్పోర్ట్స్ కారు అడుగుతున్నావు అని తిట్టినట్లు శిరీష్ తెలిపారు. ఆ రోజు ఆయన అలా తిట్టి ఉండకపోతే నటుడిగా రాణించాలనే కోరిక నాకు వచ్చేది కాదు అని శిరీష్ తెలిపాడు. ఈ చిత్రంలో నాగబాబుగారు నా తండ్రిగా నటించారు. ఆయన పాత్ర మా నాన్న లాగే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని మా నాన్నకు అంకితం ఇస్తున్నా అని శిరీష్ తెలిపాడు. 

click me!