విజయ్‌ `బీస్ట్` నుంచి వాలెంటైన్స్ డే గిఫ్ట్ .. ట్రెండింగ్‌లో `అరబిక్‌ కుత్తు`.. శివకార్తికేయన్‌పై ప్రశంసలు

Published : Feb 14, 2022, 10:32 PM IST
విజయ్‌ `బీస్ట్` నుంచి వాలెంటైన్స్ డే గిఫ్ట్ .. ట్రెండింగ్‌లో `అరబిక్‌ కుత్తు`.. శివకార్తికేయన్‌పై ప్రశంసలు

సారాంశం

దళపతి విజయ్‌ తన అభిమానులకు వాలెంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న `బీస్ట్` చిత్రం నుంచి తొలి పాటని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌ అవుతుంది.

దళపతి విజయ్‌(Vijay) నటించిన `బీస్ట్`(Beast) చిత్రం నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్ వచ్చింది. ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ `అరబిక్‌ కుత్తు`(Arabic Kuthu)ని ప్రేమికుల రోజు సందర్భంగా సాయంత్రం విడుదల చేశారు. విజయ్‌, పూజాల మధ్య వచ్చే ఈ డ్యూయెట్‌ సాంగ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతుంది. ఈ పాటకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చగా, ఈ పాటని హీరో శివకార్తికేయన్‌ రాయడం విశేషం. ప్రస్తుతం ఈ పాట మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. 

ఈ పాటలో Vijay తనదైన స్టయిలీష్‌ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. అదరగొడుతున్నారు. పూజా హెగ్డేతో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఈ పాటకి జానీ మాస్టర్‌ డాన్సులు కంపోజ్‌ చేశారు. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని మించి ఈ పాట ఉండాలని భావించారు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌. వరల్డ్ వైడ్‌గా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేశారు. అందుకే దీనికి `అరబిక్‌ కుత్తు` అని పెట్టారు. ఈ పాట ఇంతగా ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్​ ఇచ్చిన అరబిక్​ టచ్​. అరబిక్‌ హమ్మింగ్‌ పదాలను సేకరించి, వాటికి తమిల పదాలు మేళవించి రాశాడట శివకార్తికేయన్‌. 

ఈ పాట ద్వారా తనకు వచ్చిన రెమ్యూనరేషన్‌ని సేవా కార్యక్రమానికి ఉపయోగించారు శివకార్తికేయ. సినీ గేయ రచయిత దివంగత ముత్తుకుమార్‌ ఆరేళ్ల క్రితం చనిపోయారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. `అరబిక్‌ కుత్తు` పాటకిగానూ అందుకున్న పారితోషికాన్ని ముత్తుకుమార్‌ ఫ్యామిలీకి అందజేశారు శివ కార్తికేయన్‌. కోలీవుడ్​ సెన్సేషన్​ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో `బీస్ట్` చిత్రం రూపొందుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇదిరూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: పారుతో కలిసి జ్యో కొత్త ప్లాన్- కార్తీక్ కి బిగ్ షాక్- సీఈఓగా జ్యో
Sunny Leone Upcoming Films: సన్నీలియోన్ క్రేజ్ చూశారా.. చేతిలో ఏకంగా 5 భారీ సినిమాలు, ఒక వెబ్ సిరీస్