తన కూతురు మరణంపై మొదటి సారి స్పందించారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ(Vijay Antony). తన బిడ్డతో పాటు.. తాను కూడా మరణించానంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఏమన్నారంటే..?
తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) కూతురు మీరా (meera) ఈమధ్యే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కూతురి మరణం తరువాత విజయ్ ఆంటోనీ తొలిసారి స్పందించారు. సోషల్ మీడియాలో ఓ నోట్ ను రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ తన కూతురితో పాటు తాను చనిపోయానంటూ ఎమోషనల్ అయ్యారు. తన కూతురు ఎప్పుడూ తమతో బ్రతికుండేలా.. మంచి పనులు చేస్తానని.. ఇక నుంచి తను చేయబోయే ప్రతి మంచి పని తన కూతురు పేరునే చేస్తానన్నారు.
తాను చేసే ప్రతీ మంచి పని ద్వారా తన కూతురునుతమతో బ్రతికుండేలా చేసుకుంటామన్నారు విజయ్. దీనితోనైనా ఆమెతో కలిసి ఉన్నట్లుగా ఉంటుందని సోషల్ మీడియా నోట్ లో రాసుకొచ్చారు విజయ్(Vijay Antony). ఇంకా ఆయన ఏమన్నారంటే.. నా కూతురు ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు కూడా. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, చెడు, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన చోటుకి వెళ్లింది. అయినప్పటికీ ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆమె చనిపోయినప్పుడు తనతో పాటు నేను చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.” అంటూ విజయ్ ఆంటోనీ ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. ప్రస్తుతం ఆయన రిలీజ్ చేసిన నోట్ వైరల్ అవుతోంది.
undefined
ఇక ఈమధ్యనే విజయ్ ఆంటోని (Vijay Antony)పెద్ద కూతురు మీరా 16 ఏళ్ళ వయస్సులో బలవాన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం చెన్నైలోని తమ నివాసంలో తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది మీర. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె ఎలక్ట్రికల్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది.. ఈ విషయాన్ని గమనించిన ఫ్యామిలీ మెంబర్స్ హుటా హుటిన ఆమెను సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మీర మరణించినట్టు డాక్టర్లు తేల్చేశారు.
ఎంతో ముద్దుగా పెంచుకున్న గారాల కూతురు మరణంతో...విజయ్ ఆంటోనీ(Vijay Antony) కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. విజయ్ ఆంటోనికి కోలీవుడ్ సంతాపం తెలిపింది. తమిళ స్టార్స్ అంతా ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. మీరాకు నివాళి అర్పించారు. విజయ్ కు ధైర్యం చెప్పారు. ఇక మీరా అంత్యక్రియలు బుధవారం నాడు జరిగాయి. ఆమె మరణంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో ఆత్మహత్యల గురించి.. అది కూడా పిల్లల ఆత్మ హత్యల గురించి విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.