విజయ్ ఆంటోని ఎందుకిలా చేస్తున్నాడు?

By Surya PrakashFirst Published Apr 19, 2021, 10:07 AM IST
Highlights

 ఇప్పుడు విజయ్ ఆంటోని వంటి స్టార్ కూడా తమ సినిమా రిలీజ్ ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

బయిట సెకండ్ వేవ్ కరోనా విజృంభణ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది రిలీజ్ లు పెట్టుకోవటానికి భయపడుతున్నారు. వకీల్ సాబ్ వంటి మాస్ అప్పీల్ ఉన్న స్టార్ చేసిన సినిమాకే కలెక్షన్స్ డ్రాప్ అయ్యిపోయాయి. ఫ్యామిలీలు థియోటర్ వైపుకు తొంగ చూసే ధైర్యం చేయటం లేదు. కానీ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మొన్న ఆర్జీవి దెయ్యం రిలీజైంది. అసలు జనమే లేరు. అయితే అది ఎక్సపెక్ట్ చేసే ..ఏదో రిలీజ్ కావాలి కాబట్టి చేసినట్లు చేసారు. ఇప్పుడు విజయ్ ఆంటోని వంటి స్టార్ కూడా తమ సినిమా రిలీజ్ ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి టైమ్ లో రిలీజ్ చేసి ఏం పాముకుంటాడు అంటున్నారు. ఇంతకీ ఆయన సినిమా ఏమిటి ..ఆ వివరాల్లోకి వెళితే..
 
న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.  

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ ‘‘రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా పాటలకు, ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా … చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కిస్తున్నాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మే 14న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌, ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌.‌ 

click me!