మరో పొలిటికల్ బయోపిక్‌లో విద్యాబాలన్

Published : Mar 28, 2019, 07:05 PM IST
మరో పొలిటికల్ బయోపిక్‌లో విద్యాబాలన్

సారాంశం

రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విద్యాబాలన్ ఇప్పుడు మరో బయోపిక్ కమిటైంది.  దేశంలో అత్యున్నత దళితనేతగా పేరొందిన మయావతి బయోపిక్  లో ఆమె నటించనుందని సమాచారం.

రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విద్యాబాలన్ ఇప్పుడు మరో బయోపిక్ కమిటైంది.  దేశంలో అత్యున్నత దళితనేతగా పేరొందిన మయావతి బయోపిక్  లో ఆమె నటించనుందని సమాచారం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రూపొందనుంది. ఈ సినిమాకు సుభాష్‌కపూర్ దర్శకత్వం వహించనున్నారు. 

అలాగే మాయవతి పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషించనున్నారని బాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయాన్ని సుభాష్ కపూర్ స్పష్టం చేయాల్సివుంది. మాయావతి రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉండటంతోపాటు ఆమెపై అనేక ఆరోపణలున్నాయి. ఇదిలావుండగా విద్యాబాలన్ ఒక వెబ్ సిరీస్‌లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.

ఇక  ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించి ఆమె తెలుగువారికి దగ్గరయ్యారు. నందమూరి తారక రామారావు సతీమణి బసవ తారకం పాత్రలో ఆమె కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో పెద్దగా పేరు రాలేదు. కానీ విద్యాబాలన్ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

PREV
click me!

Recommended Stories

కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
చిరంజీవి తన భార్య సురేఖకు నేర్పించిన రెండు స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? అల్లు వారిపై మెగాస్టార్ ఫన్నీ కౌంటర్