ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకి అస్వస్థత!

Published : Feb 21, 2019, 02:07 PM IST
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకి అస్వస్థత!

సారాంశం

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.

కొంతకాలం క్రితం పక్షవాతం బారిన పడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ వార్త తెలిసిన కొందరు సినీ ప్రముఖులు హాస్పిటల్ కి చేరుకున్నట్లు సమాచారం. 

1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ ఎన్నో భారీ చిత్రాలను రూపొందించారు. ఆయన రూపొందించిన 'అమ్మోరు','అరుందతి' చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్ ని  కొనసాగిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య