హగ్ చేసుకోవాలని ఉంటుంది.. కానీ కంట్రోల్ చేసుకున్నా: విజయ్ దేవరకొండ

Published : Oct 28, 2018, 11:31 AM IST
హగ్ చేసుకోవాలని ఉంటుంది.. కానీ కంట్రోల్ చేసుకున్నా: విజయ్ దేవరకొండ

సారాంశం

తక్కువ టైమ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో దిట్ట అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా యువతను ఎలా ఆకర్షించాలో వారితో ఎలా ఉండాలో తెలిసిన హీరో

తక్కువ టైమ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో దిట్ట అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా యువతను ఎలా ఆకర్షించాలో వారితో ఎలా ఉండాలో తెలిసిన హీరో. ఇకపోతే రీసెంట్ గా సవ్యసాచి ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లిన ఈ హీరో సంగీత దర్శకుడైన కీరవాణి గురించి చెప్పాడు. 

తనకు కీరవాణి గారు ముందే తెలుసని ఒకసారి ముంబైలో కలిసినట్లు తెలిపాడు. అంతే కాకుండా తామిద్దరం ఒకసారి ఫ్లైట్ లో కలిసినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేశాను. అప్పుడు తన దగ్గర డబ్బులు లేవని అయితే ఆ డబ్బులు కీరవాణి గారే చెల్లించారని వివరిస్తూ.. ఆయనను చూసినప్పుడల్లా హగ్ చేసుకోవాలని అనిపిస్తుంటోంది గాని ప్రతిసారి ఉరికే హగ్ ఇస్తే బావుండదు కదా అని కంట్రోల్ చేసుకున్నట్లు చెప్పాడు. 

ముఖ్యంగా ఈ రోజు మాన్ అఫ్ ది డే కీరవాణి అని చెప్పిన విజయ్ డైలాగ్ కు ఆడియెన్స్ అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలిపాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన సవ్యసాచి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?