
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (kaikala satyanarayana) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి (apollo hospital) తరలించారు. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై (ventilator) చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కైకాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాల సత్యనారాయణను అపోలోకు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.