వెంకీమామ కొత్త పోస్టర్ : కలర్ ఫుల్ మామా అల్లుళ్ళు!

Published : Sep 02, 2019, 04:35 PM ISTUpdated : Sep 02, 2019, 04:43 PM IST
వెంకీమామ కొత్త పోస్టర్ : కలర్ ఫుల్ మామా అల్లుళ్ళు!

సారాంశం

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 చిత్రం వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అదే జోరుతో ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో వెంకీ నటిస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రాలకు టాలీవుడ్ లో ఈ సీనియర్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. 

ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వెంకీ, చైతు రెడ్ పైజామా, పంచె కట్టులో కలర్ ఫుల్ గా మెరిసిపోతున్నారు. ఈ చిత్రంతో వెంకీ మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. 

వెంకీకి జోడిగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్, చైతుకు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా