రామ్ నెక్ట్స్ త్రివిక్రమ్ కథ,డైరక్టర్ ఎవరంటే..?

By Surya Prakash  |  First Published Dec 23, 2020, 4:18 PM IST

అసలు మొదట త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందనుకున్నారు. కానీ చివరకు త్రివిక్రమ్ రాసిన కథలో రామ్ సరిపెట్టుకోవాల్సి వస్తోందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సమర్దుడు ఎవరు. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్టుని అంతే సమర్దవంతంగా తెరకెక్కించగలిగేది ఎవరు ..అంటే ఆయన శిష్యుడు వెంకీ కుడుముల అని తెలుస్తోంది. .

ప్రముఖ దర్శక,రచయిత త్రివిక్రమ్ స్క్రిప్టు రాసారంటే ఆ డిమాండే వేరు. ఆ కథలు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఆయన నేరేషన్ లో మ్యాజిక్ చేస్తారు. డైలాగులతో సినిమాని పండిస్తారు. క్యారక్టర్స్ తో కొత్త అర్దాలు చెప్పిస్తారు. సినిమాని వేరే లెవిల్ కు తీసుకెళ్తారు. అందుకే ఆయనతో పనిచేయాలని హీరోలంతా ఉవ్విళ్లూరుతారు. అయితే అందరినీ ఆయన డైరక్ట్ చేయలేరు. అలాగని ఆయన తన స్క్రిప్టులు ఎవ్వరికీ ఇవ్వటం లేదు. కానీ తాజాగా త్రివిక్రమ్ రాసిన స్క్రిప్టుతో  రామ్ హీరోతో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతన్నట్లు తెలుస్తోంది. 

అసలు మొదట త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందనుకున్నారు. కానీ చివరకు త్రివిక్రమ్ రాసిన కథలో రామ్ సరిపెట్టుకోవాల్సి వస్తోందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సమర్దుడు ఎవరు. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్టుని అంతే సమర్దవంతంగా తెరకెక్కించగలిగేది ఎవరు ..అంటే ఆయన శిష్యుడు వెంకీ కుడుముల అని తెలుస్తోంది. .

Latest Videos

 వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ ఏడాది ప్రారంభంలో నితిన్ తో 'భీష్మ' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో వెంకీ కుడుముల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో  హీరో రామ్ తో  వెంకీ కుడుముల ప్రాజెక్టు ఓకే అయ్యిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ రాసిన  స్క్రిప్ట్  తో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ కి కూడా ఈ స్టోరీ నచ్చిందని.. రామ్ నెక్స్ట్ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలోనే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  మరి రామ్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని హారిక హాసిని సంస్థ నిర్మించ‌బోతోంద‌ని స‌మాచారం. 

click me!