`ఎఫ్‌3` షూటింగ్‌లో జాయినైన వెంకీమామ.. ఏకంగా ఐదు సినిమాలు సెట్‌లో

Published : Dec 23, 2020, 03:38 PM IST
`ఎఫ్‌3` షూటింగ్‌లో జాయినైన వెంకీమామ.. ఏకంగా ఐదు సినిమాలు సెట్‌లో

సారాంశం

`ఎఫ్‌3`ని తెరకెక్కించబోతున్నట్టు వెంకీ పుట్టిన రోజున ప్రకటించారు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం షూటింగ్‌ని ప్రారంభించారు. తొలి షెడ్యూల్‌, తొలిరోజు వెంకీమామ వెంకటేష్‌ పాల్గొనడం విశేషం. ఆయన షూటింగ్‌లో పాల్గొని చిత్ర బృందాన్ని సరదాగా నవ్వించినట్టు దర్శకుడు అనిల్‌రావిపూడి తెలిపారు.

వెంకటేష్‌ కి చాలా రోజుల తర్వాత పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన చిత్రం `ఎఫ్‌2`. తన మార్క్ కామెడీని చాలా రోజుల తర్వాత చవిచూపించిందీ చిత్రం. అనిల్‌ రావిపూడి మార్క్ దర్శకత్వ ప్రతిభ, వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లోని కామెడీ, తమన్నా, మెహరీన్‌ అందాలు ఈ సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించాయి.  తాజాగా దీనికి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని తెరకెక్కించబోతున్నట్టు వెంకీ పుట్టిన రోజున ప్రకటించారు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

బుధవారం షూటింగ్‌ని ప్రారంభించారు. తొలి షెడ్యూల్‌, తొలిరోజు వెంకీమామ వెంకటేష్‌ పాల్గొనడం విశేషం. ఆయన షూటింగ్‌లో పాల్గొని చిత్ర బృందాన్ని సరదాగా నవ్వించినట్టు దర్శకుడు అనిల్‌రావిపూడి తెలిపారు. ఇందులో గత కాస్టింగే అయిన వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల 50వ వసంతంలోకి అడుగుపెట్టిన దిల్‌రాజు బుధవారం ఏకంగా తాను నిర్మించే ఐదు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. `ఎఫ్‌3`తోపాటు `వకీల్‌ సాబ్‌`, `థ్యాంక్యూ`, `పాగల్‌`, `హుషారు` డైరెక్టర్‌ హర్షతో తీయబోతున్న సినిమాని సెట్‌పైకి తీసుకెళ్లినట్టు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందే ఐదు సినిమాలు ఏకకాలంలో సెట్‌లో ఉండటం విశేషం. 

మరోవైపు దిల్‌రాజు ఈ సమ్మర్‌లో రెండో పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వైఘారెడ్డిని ఆయన నిజమాబాద్‌లోని వెంకటేశ్వర టెంపుల్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పడం, ఇప్పుడు ఒకేసారి ఐదు సినిమాలు షూటింగ్‌లో ఉండటం రెండో పెళ్లి దిల్‌రాజుకి బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా