స్పీడ్ పెంచిన వెంకీ..!

Published : Jun 06, 2019, 08:33 AM IST
స్పీడ్ పెంచిన వెంకీ..!

సారాంశం

గత ఏడాది వరకు వెంకటేష్ సినిమాలను సెట్స్ పైకి తేవడానికి చాలానే ఆలోచించారు. పట్టిన కథ హిట్టా ఫట్టా అనే ఆలోచనతో సతమతమయ్యారు. అయితే F2 ఇచ్చిన బూస్ట్ తో వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు.

గత ఏడాది వరకు వెంకటేష్ సినిమాలను సెట్స్ పైకి తేవడానికి చాలానే ఆలోచించారు. పట్టిన కథ హిట్టా ఫట్టా అనే ఆలోచనతో సతమతమయ్యారు. అయితే F2 ఇచ్చిన బూస్ట్ తో వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు. కథల ఎంపిక విషయంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

వెంకీ చేతిలో ప్రస్తుతం 4 నుంచి 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం మేనల్లుడితో వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత త్రినాథరావు నక్కినతో అలాగే త్రివిక్రమ్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక తరుణ్ భాస్కర్ కూడా వెంకీ కోసం ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తరుణ్ భాస్కర్ - త్రినాథరావ్ నక్కిన కథలు దాదాపు ఫిక్స అయినట్లే. 

రీసెంట్ గా నిర్మాత డి.సురేష్ బాబు బాలీవుడ్ దేదే ప్యార్ దే డబ్బింగ్ రైట్స్ తీసుకున్నట్లు చెప్పారు. ఆ సినిమాలో కూడా వెంకటేష్ నటించే అవకాశం ఉంది. తేజ డైరెక్షన్ లో మొదలైన ఒక సినిమా మధ్యలోనే ఆగిపోగా మళ్ళీ తేజకు మరో అవకాశం ఇవ్వాలని వెంకీ ఆలోచిస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు కథలని క్యూ లో ఉంచిన వెంకీ త్వరలోనే వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..