సాహో: మ్యూజిక్ డైరెక్టర్స్ ఫైనల్ ?

By Prashanth MFirst Published Jun 6, 2019, 7:49 AM IST
Highlights

2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉన్న చిత్రం `సాహో`. బాహుబలి తర్వాత  ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. తెలుగులో సరే సరి మిగతా భాషలు వాళ్లు సైతం  `సాహో`  గురించే అందరూ మాట్లాడుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రాకకోసం ట్రేడ్ వర్గాలు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇవన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈ చిత్రానికి సంభందించిన ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్- కోలీవుడ్- మాలీవుడ్- శాండల్వుడ్ లోనూ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.  ఇలా యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న  సమయంలో సంగీత దర్శక త్రయం తప్పుకోవటం జరిగింది. దాంతో ఈ ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయ్యారు. 

ఈ  సినిమాకు మొదట నుచీ మ‌ల్టీపుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో సంగీతం చేయించాల‌నుకున్నారు దర్శక, నిర్మాత‌ల‌ు. కానీ అలా చేయటం ఇష్టపడలేదు  సంగీత ద‌ర్శ‌కుల త్ర‌యం శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. దాంతో వెంటనే దర్శక,నిర్మాతలు తమ సినిమాకు క్రేజ్ తెస్తూ మంచి మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్స్ కోసం అన్వేషణ ప్రారంభించింది.  అయితే అది ముగిసినట్లే తెలుస్తోంది. 

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమాకు బాలీవుడ్‌కు చెందిన త‌నిష్క్ బ‌గిచ్‌, గురు రాంద్వాల‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా ఎంచుకున్నార‌ట‌. మొదట నుంచీ అనుకున్నట్లుగానే ఎవరు పాటలు ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇస్తారట.

click me!