ఒకేసారి రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్ ప్రకటించిన వెంకీమామ.. ఈ ఏడాది డబుల్ బొనాంజా

Published : Jan 29, 2021, 03:20 PM IST
ఒకేసారి రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్ ప్రకటించిన వెంకీమామ.. ఈ ఏడాది డబుల్ బొనాంజా

సారాంశం

విక్టరీ వెంకటేష్‌ తాను నటిస్తున్న రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశాడు. ఓ వైపు ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ `ఎఫ్‌3`, మరోవైపు `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` విడుదల తేదీలను ప్రకటించాడు. 

వెంకటేష్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి `నారప్ప`, మరొకటి `ఎఫ్‌3`. `నారప్ప` దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా, మరోవైపు `ఎఫ్‌3` ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. `నారప్ప` చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు `ఎఫ్‌2`కి సీక్వెల్‌గా రూపొందుతున్న `ఎఫ్‌3` సినిమాని ఆగస్‌ 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొంది సంచలన విజయం సాధించిన `అసురన్‌`కి రీమేక్‌ `నారప్ప` శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లుక్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో వెంకటేష్‌ యంగ్‌, అండ్‌ ఓల్డ్  రెండు గెటప్‌లో కనిపించనున్నారు. 

దీంతోపాటు వరుణ్‌ తేజ్‌తో కలిసి రెండేళ్ల క్రితం `ఎఫ్‌2`తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు వెంకీ. అనిల్‌ రావిపూడి దీనికి దర్శకుడు. దీనికి సీక్వెల్‌` ఎఫ్‌3` రూపొందుతుంది. ఇందులో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. డబ్బు చుట్టూ నెలకొన్న ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌