జబర్దస్త్ జడ్జ్, ఎమ్మెల్యే రోజాని కలిసి యాక్షన్‌ కింగ్ అర్జున్‌..

Published : Jan 29, 2021, 02:03 PM IST
జబర్దస్త్ జడ్జ్, ఎమ్మెల్యే రోజాని కలిసి యాక్షన్‌ కింగ్ అర్జున్‌..

సారాంశం

నటి, జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే రోజాని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కలిశారు. కుటుంబ సమేతంగా రోజా నివాసంలో వారిని కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని  స్నేహితురాలైన రోజాని, ఆమె భర్త, దర్శకుడు సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు.

నటి, జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే రోజాని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కలిశారు. కుటుంబ సమేతంగా రోజా నివాసంలో వారిని కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని  స్నేహితురాలైన రోజాని, ఆమె భర్త, దర్శకుడు సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్‌ వెంట ఆయన భార్య నివేదిత, కుమార్తెలు, నటి ఐశ్వర్య, అంజనాల ఉన్నారు. 

 అనంతరం హీరో అర్జన్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి వారికి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలుపల అర్జున్‌ను చూడటానికి, పొటోలు తీసుకోడానికి భక్తులు, అభిమానులు ఉత్సహం చూపారు.  ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నారు అర్జున్‌. మూడేళ్ల క్రితం అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా`లో కీలక పాత్రలో నటించారు అర్జున్‌. ఇప్పుడు `జనగణమన`,  `ఫ్రెండ్‌షిప్‌`, `మేధావి` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌