ప్రైవేట్‌గా వెంకటేష్‌ రెండో కూతురు పెళ్లి.. సింపుల్‌గా కానిచ్చేసిన వెంకీమామ..

Published : Mar 16, 2024, 09:41 AM IST
ప్రైవేట్‌గా వెంకటేష్‌ రెండో కూతురు పెళ్లి.. సింపుల్‌గా కానిచ్చేసిన వెంకీమామ..

సారాంశం

విక్టరీ వెంకటేష్‌ తన రెండో కూతురు పెళ్లి చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా, తాజాగా సింపుల్‌గా మ్యారేజ్‌ వేడుకని పూర్తి చేశారు.   

టాలీవుడ్‌ స్టార్‌ వెంకటేష్‌ రెండో కూతురు పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. వెంకీ సెకండ్‌ డాటర్‌ మ్యారేజ్‌ విజయవాడకి చెందిన డాక్టర్‌ కొడుకు నిశాంత్‌తో శుక్రవారం జరిగింది. పూర్తి ప్రైవేట్‌ మ్యానర్‌లో ఈ వివాహ వేడుక జరగడం విశేషం. వీరి పెళ్లి వేడుకకి రామానాయుడు స్టూడియో వేదికయ్యింది. రాత్రి 9.36గంటలకు హవ్యవాహిని మెడలో మూడు ముళ్లు వేశాడు నిశాంత్‌. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరు, బడా ఫ్యామిలీలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. కానీ వెంకటేష్‌ తన కూతురు వివాహం చాలా సింపుల్‌గా, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చేయడం ఆశ్చర్య పరుస్తుంది. 

ఇక పెళ్లి కొడుకు విజయవాడకి చెందిన డాక్టర్‌ పాతూరి వెంకటేరమారావు, డా అరుణల కుమారుడు. గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దానికి చిరంజీవి, మహేష్‌ బాబు, నాగచైతన్య వంటి కొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. మ్యారేజ్‌లో మాత్రం ఫ్యామిలీ వరకు పరిమితమయినట్టు తెలుస్తుంది. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ పాల్గొన్నారని సమాచారం. కానీ అధికారికంగా కేవలం పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలనే విడుదల చేయడం గమనార్హం. 

లెజెండరీ నిర్మాత రామానాయుడు రెండో కుమారుడైన వెంకటేష్‌కి, నీరజల దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు అర్జున్‌ ఉన్నారు. ఇప్పటికే పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కూతురు మ్యారేజ్‌ కూడా అయిపోయింది. మరో కూతురు వివాహం చేస్తే వెంకీకి బాధ్యత తీరిపోతుందని చెప్పొచ్చు. ఇక అర్జున్‌ని ఆయన హీరోని చేసే అవకాశం ఉంది. తన వారసత్వంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. 

వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సైంధవ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సమాచారం. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్‌ రాబోతున్నట్టు తెలుస్తుంది. కూతరు పెళ్లి కారణంగానే ఆలస్యమయినట్టు సమాచారం. 

Read more: Keerthy Suresh : కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్.. తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ కు జోడీగా.. ఎవరంటే?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు