ఇప్పటికీ ఆ బాధ వేధిస్తోంది... మిస్ యూ నాన్న... వెంకీ భావోద్వేగం!

Published : Feb 18, 2021, 05:35 PM IST
ఇప్పటికీ ఆ బాధ వేధిస్తోంది... మిస్ యూ నాన్న... వెంకీ భావోద్వేగం!

సారాంశం

లెజెండరీ నిర్మాత రామానాయుడు వర్థంతి నేడు. 2015, ఫిబ్రవరి 18న అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు.

లెక్కకు మించిన భాషలలో సినిమాలు నిర్మించి మూవీ మొఘల్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారు.  సుదీర్ఘ సినిమా ప్రయాణంతో అద్భుత చిత్రాలు ఆయన బ్యానర్ లో తెరకెక్కాయి. అలాంటి లెజెండరీ నిర్మాత రామానాయుడు వర్థంతి నేడు. 2015, ఫిబ్రవరి 18న అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు.

'ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్‌ యూ. మిస్‌ యూ' అంటూ ట్విట్టర్ లో సందేశం పంచుకున్నారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్‌ బాబుకు తండ్రి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు.

ఇక చిత్ర పరిశ్రమకు రామానాయుడు చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. అలాగే చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ పాల్కే అవార్డును రామానాయుడు అందుకోవడం జరిగింది. రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్ టాప్ స్టార్ గా ఎదగగా, పెద్ద కుమారుడు సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు