కత్రినా కైఫ్‌తో వైజాగ్‌ బీచ్‌లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్న వెంకటేష్‌.. స్టేజ్‌పై మాస్‌ డాన్సుతో హంగామా!

Published : Jun 04, 2022, 10:30 PM ISTUpdated : Jun 04, 2022, 10:36 PM IST
కత్రినా కైఫ్‌తో వైజాగ్‌ బీచ్‌లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్న వెంకటేష్‌.. స్టేజ్‌పై మాస్‌ డాన్సుతో హంగామా!

సారాంశం

శనివారం సాయంత్రం వైజాగ్‌లో `ఎఫ్‌3 త్రిబుల్‌ బ్లాక్‌బస్టర్‌` పేరుతో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో వెంకటేష్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విక్టరీ వెంకటేష్‌(Venkatesh) తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌లో గడిపిన రోజులను నెమరేసుకున్నారు. వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలను గుర్తు చేసుకుంటూనే కత్రినా కైఫ్‌తో బీచ్‌లో తిరిగిన రోజులను వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు వెంకీ. ఆయన హీరోగా నటించిన చిత్రం `f3`, వరుణ్‌ తేజ్‌(Varun Tej) మరో హీరోగా నటించగా, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌చౌహాన్‌ కథానాయికలుగా నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. 

తాజాగా శనివారం సాయంత్రం వైజాగ్‌లో `ఎఫ్‌3 త్రిబుల్‌ బ్లాక్‌బస్టర్‌` పేరుతో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో వెంకటేష్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్‌ని చూస్తుంటే ఒకప్పుడు తనసినిమాలకు సంబంధించిన షూటింగ్‌ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. `కళియుగ పాండవులు`, `స్వర్ణకమలం`, `గోపాల గోపాల`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రాలు చేశానని తెలిపారు. ఇక `మల్లీశ్వరి` సినిమా కోసమైతే ఏకంగా కత్రినా కైఫ్‌(Katrina Kaif)తో అలా నడుస్తూ బీచ్‌లో తిరిగినట్టు తెలిపారు. `గురు` సినిమాలోని జింగిడి సాంగ్‌ ఇక్కడే చేశానని, వైజాగ్‌తో అనేక మెమరీలున్నాయని చెప్పారు. 

అదే సమయంలో సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందని, అనిల్‌ రావిపూడికి,దిల్‌రాజుకి థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్‌. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇవ్వాలని కష్టపడ్డామని తెలిపారు. మరోవైపు ఇంత పెద్ద హిట్‌ కి కారణమైన ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ, మహిళా ఆడియెన్స్ ని ప్రత్యేకంగా మెన్షన్‌ చేయడం విశేషం. `దృశ్యం2`, `నారప్ప` చిత్రాలతో తన ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యారని, అందుకే `ఎఫ్‌3`లో నారప్ప గెటప్‌ పెట్టామని తెలిపారు.

ఇక్కడికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా తర్వాత లేడీ ఆడియెన్స్ బయటకు రారు అన్నారు. కానీ వాళ్లు వచ్చి సక్సెస్‌ చేశారని, వారిని ఇలా చూస్తుంటే ఆనందంగా ఉందని, వారిని వచ్చి హగ్‌ చేసుకోవాలని ఉందని తెలిపారు.అనంతరం ఆడియెన్స్ లో, అభిమానులో జోష్‌ ని నింపారు. తనదైన డైలాగ్‌లో ఊపు తీసుకొచ్చారు. అనంతరం `కుర్రాడు బాబోయ్‌.. `అనే పాటకి డాన్సులు వేశారు. అనిల్‌ రావిపూడి, వెంకీ, వరుణ్‌ తేజ్‌ కలిసి స్టేజ్‌పైనే అదిరిపోయే మాస్ స్టెప్పులేసి ఈవెంట్‌కి కళ తీసుకొచ్చారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 

మరోవైపు ఇందులో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియెన్స్ థ్యాంక్స్‌ చెబుతూ, త్వరలో `ఎఫ్‌ 4` సినిమాతో వస్తున్నామని తెలిపారు. మరోవైపు నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, తొమ్మిది రోజుల్లో వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వసూలు చేసిందనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్‌.. దిల్‌రాజ్‌కి మూవీ మోఘల్‌ అంటూ బిరుదు ఇవ్వడం విశేషం. రామానాయుడుని అలా పిలిచే వారిమని, ఇప్పుడు దిల్‌రాజుని అలా పిలుస్తున్నామని, అలాంటి సినిమాలు చేస్తూ వచ్చారని కొనియాడారు రాజేంద్రప్రసాద్‌.ఇందులో అలీ, శ్రీనివాస్‌ రెడ్డి, వరుణ్‌ తేజ్‌ ఇతర ఆర్టిస్టులు,టెక్నీషియన్లు పాల్గొన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?