వెంకటేష్‌తో త్రిష రొమాన్స్.. 14ఏళ్ల తర్వాత కలుస్తున్న జోడీ.. ?

Published : Feb 25, 2024, 03:47 PM IST
వెంకటేష్‌తో త్రిష రొమాన్స్.. 14ఏళ్ల తర్వాత కలుస్తున్న జోడీ.. ?

సారాంశం

విక్టరీ వెంకటేష్‌ చివరగా `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. సంక్రాంతికి ఈ మూవీ విడుదలైంది. తీవ్ర నిరాశ పరిచింది. కానీ ఈ సారి మాత్రం డిజప్పాయింట్‌ చేయకూడదని ప్లాన్‌ చేస్తున్నారట.   

విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌ ఇటీవల గాడి తప్పుతుంది. ఏ సినిమా చేసినా వర్కౌట్‌ అవడం లేదు. ఇటీవల `సైంధవ్‌`తో ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాడు. ఒక్క `ఎఫ్‌3`నే బలవంతంగా వర్కౌట్‌ అయ్యింది. అంతకు ముందు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయన నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందన్నారు. కానీ దీనిపై అప్‌డేట్‌ లేదు. గతంలోనూ ఈ కాంబో రావాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. 

తాజాగా వెంకటేష్‌ తనకు `ఎఫ్‌2`, `ఎఫ్‌3` విజయాలను అందించిన అనిల్‌ రావిపూడితో సినిమా చేయబోతున్నారట. ఈ కాంబోలో సినిమా ఫైనల్‌ అయినట్టు తెలుస్తుంది. వెంకీ కామెడీ టైమింగ్‌కి, అనిల్‌ రావిపూడి వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలను అందించే దర్శకుడు పడితే ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్‌ అవుతుందని భావిస్తున్నారు. ఆ వినోదాన్ని డబుల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుంది. 

అయితే ఇందులో హీరోయిన్‌గా మాత్రం ఇంట్రెస్టింగ్‌ నేమ్‌ వినిపిస్తుంది. త్రిషని అనుకుంటున్నారట. దాదాపు కన్ఫమ్‌ అని అంటున్నారు. వెంకటేష్‌, త్రిష కాంబినేషన్‌లో అంతకు ముందు `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `నమో వెంకటేశ` చిత్రాలు వచ్చాయి. రెండు బాగానే ఆడాయి. దాదాపు 14ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి చేయబోతున్నారు.

వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమాని దిల్‌ రాజు నిర్మించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి దిల్‌రాజు `శతమానం భవతి2`ని ప్రకటించారు. కానీ ఆ స్థానంలో వెంకీ మూవీని తీసుకురావాలనుకుంటున్నారట. అనిల్‌ రావిపూడి చివరగా బాలయ్యతో `భగవంత్‌ కేసరి` మూవీని రూపొందించారు. ఇది ఫర్వాలేదనిపించుకుంది. 

Read more: అమలా పాల్‌ బేబీ బంప్ పై భర్త ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ .. బీచ్‌లో విలువైనది పంచుకున్న డస్కీ బ్యూటీ..

ఇక త్రిష తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తుంది. త్రిష బాలయ్యతో చేసిన `లయన్‌` తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. దాదాపు తొమ్మిదేళ్లు అవుతుంది ఆమె తెలుగులో సినిమా చేయక ఇప్పుడు చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు వెంకీతోనే మెరుస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ పండగలా ఉంటుందని తెలుస్తుంది. 

Also read: ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, నయనతార.. సొంత విమానం కలిగి ఉన్న సౌత్ స్టార్స్ వీళ్ళే...
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు