గంజాయి తాగుతూ పట్టబడ్డాడు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.. ఈకేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈక్రమంలో షణ్ముఖ్ ఈ విషయంలో స్పందించినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అతని అన్న రీసెంట్ గా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..? వేరేకేసు విషయంలో జస్వంత్ ప్లాట్ కు వెళ్తే.. గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ కేసులో పోలీసుల నుంచి జస్వంత్ చెప్పినట్టు గా ఓ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవించినట్టు పోలీసులు నిర్దారించారు.
అయితే షణ్ముఖ్ జస్వంత్ మాత్రం దానికి కారణాలు చెప్పినట్టు తెలుస్తోంది. తాను డిప్రెషన్ లో ఉన్నాను అని, నా పరిస్థితి ఏం బాగోలేదు అని, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని.. ఆ బాధలోనే గంజాయి తీసుకున్నాను అని అతను తెలిపినట్టు సమాచారం. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కేసు బలపడుతోంది. అతను చాలా మందిని మోసం చేసినట్టు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
సంపత్ వినయ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్దం కూడా చేసుకున్నాడ. కాని ఆతరువా ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకోవడం కోసం రెడీ అవుతున్నట్టు ఆమె కంప్టైట్ లో పేర్కొంది. తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు అతని కోసం వెళ్లగా అన్నదమ్ములు గంజాయి సేవిస్తూ బయటపడ్డారు.
తాజాగా సంపత్ వినయ్ పై మరో కేసు కూడా నమోదు అయింది. సంపత్ తో పాటు MBA చదివిన ఓ అమ్మాయి వద్ద 20 లక్షలు తీసుకొని, బిజినెస్ పేరుతో మోసం చేసాడని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో షణ్ముఖ్ జస్వంత్, అతని అన్న సంపత్ వినయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.