పూరి 'కేవ్' లో సుకుమార్ తో పార్టీ, ఆ హీరోలు గెస్ట్ లు

Published : Nov 05, 2018, 04:23 PM IST
పూరి 'కేవ్' లో  సుకుమార్ తో పార్టీ, ఆ హీరోలు గెస్ట్ లు

సారాంశం

గత కొంతకాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా వెనకపడ్డారు. అయితే ఆయన ఉత్సాహంలో ఎక్కడా వెనకబడలేదు. తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోనూ ఎక్కడా మార్పులేదు. 

గత కొంతకాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా వెనకపడ్డారు. అయితే ఆయన ఉత్సాహంలో ఎక్కడా వెనకబడలేదు. తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోనూ ఎక్కడా మార్పులేదు. పగలంతా తన కుమారుడు ఆకాష్ చిత్రానికి  స్క్రిప్టు వర్క్. రాత్రిళ్లు తన స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు, పార్టీలు. ఈ సెటప్ అంతా ఆయన ఆఫీస్  కేవ్ లో జరుగుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ అయితే ఆ రచ్చ వేరు అని కేవ్ కు పర్మనెంట్ కష్టమర్స్ అయిన ఆయన స్నేహితులు చెప్తూంటారు. 

ఇక అసలు విషయానికి వస్తే..ఈ వారం ఈ కేవ్ లో పార్టీకు హాజరైంది ఎవరో తెలుసా ప్రముఖ దర్శకుడు సుకుమార్. పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి ఎలాగో అక్కడే ఉంటోంది. ఇక హీరో శ్రీకాంత్, అల్లరి నరేష్, తరుణ్,సుదీప్  లు కూడా ఈ పార్టీలో కనిపించారు. 

ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటారా..ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. ఆ ఫొటోలను ఛార్మీ తన సోషల్ నెట్ వర్క్ సైట్ లో అప్ లోడ్ చేసి తమ ఉత్సాహాన్ని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది.  ఇంతకీ సుకుమార్ ఆ పార్టీకు రావటం వెనకాల ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా..పూరి కుమారుడు ప్రాజెక్టులో సుకుమార్ ని ఏమైనా కలిపే ప్రయత్నం జరుగుతోందా ఏమో..ఏదైనా జరగచ్చు. 
 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?