వెంకటేష్‌ కెరీర్‌లోనే భారీ ఖర్చుతో `సైంధవ్‌` క్లైమాక్స్.. స్పెషాలిటీ ఇదే!

Published : Aug 13, 2023, 02:31 PM IST
వెంకటేష్‌ కెరీర్‌లోనే  భారీ ఖర్చుతో `సైంధవ్‌` క్లైమాక్స్.. స్పెషాలిటీ ఇదే!

సారాంశం

వెంకటేష్‌ `సైంధవ్‌` చిత్రంలో ఫుల్‌ మాస్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సారి విశ్వరూపం చూపించబోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి  ఓ కీలక ఎపిసోడ్‌ని పూర్తి చేశారట.

విక్టరీ వెంకటేష్‌.. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాలతో లాభం లేదని తాజాగా యాక్షన్‌ మూవీల వైపు ఫోకస్ పెట్టాడు. పూర్తి స్థాయి యాక్షన్‌ మూవీ చేస్తున్నాడు. `హిట్‌` చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శైలేష్‌ కొలను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోర్ట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ లు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వెంకటేష్‌ ఫుల్‌ మాస్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సారి విశ్వరూపం చూపించబోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ కీలక ఎపిసోడ్‌ని పూర్తి చేశారట. భారీ క్లైమాక్స్ పార్ట్ ని పూర్తి చేసినట్టు తెలిపింది యూనిట్‌. ఎనిమిది మంది ముఖ్యమైన నటులు పాల్గొన్న ఈ షెడ్యూల్‌ తాజాగా పూర్తయ్యిందని వెల్లడించారు. దీంతో మెయిన్‌ పోర్షన్‌ పూర్తయ్యిందట. 

అయితే అత్యంత ప్రతికూల వాతావరణంలో, హై ఆక్టేన్‌ ఎమోషనల్‌ క్లైమాక్స్ ని పూర్తి చేశామని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో షూటింగ్‌ అయిపోయాక టీమ్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇందులో వెంకటేష్‌ కూడా ఉండటం విశేషం. టీమ్‌కి ఆయన థ్యాంక్స్ చెబుతూ వెళ్లిపోయారు. దీంతో టీమ్‌ అంతా డాన్సులతో పండగ చేసుకున్నారు. దాదాపు 16 రోజులపాటు ఈ క్లైమాక్స్ పోర్షన్‌ని పూర్తి చేసినట్టు చెప్పారు.

 ఇందులో రామ్‌ లక్ష్మణ్‌ల సారథ్యంలో భారీ యాక్షన్‌ సీన్లు కూడా ఉన్నట్టు తెలిపారు. ఇంటెన్స్ యాక్షన్‌ ఎపిసోడ్‌ని వీరు డైరెక్ట్ చేశారట. ఇది వెంకటేష్‌ కెరీర్‌లోనే అత్యంత ఖర్చుతో కూడిన యాక్షన్‌ సీన్లు అని చెప్పారు. సినిమాలో నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని చెబుతున్నారు. `సైంధవ్‌` భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఇందులో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రుహానీ శర్మ, ఆండ్రియా, సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డిసెంబర్‌ 22 క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సినిమాకి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ మణికందన్‌ కెమెరా వర్క్ చేస్తుంది. గ్యారీ బీహెచ్‌ ఎడిటర్‌. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఉన్నారు.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే