'జైలర్' కి పెద్ద దెబ్బే..లేకపోతే రెట్టింపు కలెక్షన్స్ వచ్చేవి

Published : Aug 13, 2023, 02:18 PM IST
'జైలర్' కి పెద్ద దెబ్బే..లేకపోతే రెట్టింపు కలెక్షన్స్ వచ్చేవి

సారాంశం

సూపర్‌స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి.

ఆగస్టు 10న రజనీకాంత్ తాజా చిత్రం జైలర్‌ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది.  పెద్దగా ప్రచారం లేదు కానీ ప్రీరిలీజ్‌ పంక్షన్ లేదు..సోషల్ మీడియా రచ్చ లేదు ..కానీ ఓపినింగ్స్ అదిరిపోయాయి. సినిమాకు హిట్ టాక్ రావటంతో కలెక్షన్స్   ప్రచారం జోరందుకుంది రెండో రోజు భోళా శంకర్ ఎఫెక్ట్ తో  వసూళ్లు కాస్త నెమ్మదించినా మూడో రోజుకు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.220 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్స్‌(రూ.70 కోట్లు)తో 2023లో తమిళనాడులో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌, బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ ఆఫ్‌ 2023 ఇన్‌ యూఎస్‌ఏ, బిగ్గెస్ట్‌ తమిళ్‌ ఓపెనర్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ ఇన్‌ 2023 రికార్డులు జైలర్‌ హస్తగతమయ్యాయి. టైగర్‌ కా హుకుం అన్నట్లుగా బాక్సాఫీస్‌ రికార్డులు జైలర్‌ సినిమాకు దాసోహమవుతున్నాయి. 

తెలుగులోనూ కలెక్షన్స్‌ అదిరిపోతున్నాయి. చాలాచోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు పడుతున్నాయి. భోళా శంకర్‌కు  డిజాస్టర్ టాక్ రావటంతో జనం ఈ సినిమా వైపై మ్రొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సినిమాకు సరిపడనన్ని థియేటర్స్ లేకపోవటం తెలుగులో మైనస్ గా మారింది అంటన్నారు.  క్రేజ్ లేని డబ్బింగ్ సినిమాగా భావించి లైట్ తీసుకుని ఎక్కువ థియేటర్స్ కేటాయించకపోవటం దెబ్బైంది. హైదరాబాద్ లో చాలా చాలా తక్కువ సింగిల్ స్క్రీన్స్, సరిపడనన్ని మల్టిప్లెక్స్ షోలు లేవు. ఎగ్రిమెంట్ ప్రకారం వారం అయితే కానీ థియేటర్స్ చాలా చోట్ల పెరగి అవకాసం లేదు. అప్పటికీ దిల్ రాజు, ఏషియన్ సునీల్ ఈ సినిమాని రిలీజ్ చజేయటంతో  కొన్ని థియేటర్లలో భోళా శంకర్  సినిమాను జైలర్‌తో రీప్లేస్‌ చేస్తున్నారు. ఏదైమైనా  తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్‌ డామినేషన్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం జైలర్‌ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎక్కువ స్క్రీన్స్ ఉంటే ఇప్పటికి వచ్చే కలెక్షన్స్ రెండు రెట్లు వచ్చేవి అంటున్నారు. 

ఇక  ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు.   రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని చెప్పొచ్చు. చాలా నార్మిల్  సీన్స్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది.  

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?