గ్రాండ్‌గా వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం.. వెంకీ మూవీలో ఈ `3ఎక్స్‌` గోలేంటి సామీ..

Published : Jul 03, 2024, 05:04 PM IST
గ్రాండ్‌గా వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం.. వెంకీ మూవీలో ఈ `3ఎక్స్‌` గోలేంటి సామీ..

సారాంశం

వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్నసినిమా నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఇందులో `3ఎక్స్‌` కాన్సెప్ట్ షాకిస్తుంది. వెంకీ సినిమాలో ఇదేంటి అంటున్నారు.  

విక్టరీ వెంకటేష్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు సరైన హిట్‌ పడటం లేదు. సాలిడ్‌ హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. `ఎఫ్‌ 2` బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ యావరేజ్‌గా, డిజాస్టర్‌గా నిలిచాయి. చివరగా ఆయన ఈ సంక్రాంతికి `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. ఇది పూర్తిగా నిరాశ పరిచింది. తన బలమైన కామెడీ విడిచి యాక్షన్‌ చేస్తే బెడిసికొట్టింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వినోదాన్నే నమ్ముకున్నాడు వెంకటేష్‌. తనకు `ఎఫ్‌2, `ఎఫ్‌3` చిత్రాలను అందించిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్‌ వెంకీకి వైఫ్‌గా, మీనాక్షి చౌదరి ప్రియురాలిగా కనిపించబోతున్నారట. ఇందులో వెంకీ మాజీ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారట. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌ మేళవింపుగా ఉంటుందని, సరికొత్తగా ఈ మూవీని దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఇందులో `3ఎక్స్`అనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ మూవీలో ఈ 3 ఎక్స్ ఉండటమేంటనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే దానికో కాన్సెప్ట్ ఉంది. అదేంటనేది చూస్తే, వెంకీ `ఎక్స్` కాప్‌(పోలీస్‌), అలాగే ఐశ్వర్య రాజేష్‌ `ఎక్స్`లెంట్‌ వైఫ్‌ అని, మీనాక్షి చౌదరి `ఎక్స్` గర్ల్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఈ మూడింటిని ఇలా క్రేజీగా మలిచారట. ఇదిప్పుడు వైరల్‌గా మారింది. 

ఇక ఈ సినిమా నేడు బుధవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. రామానాయుడుస్టూడియోలో సినిమాని ప్రారంభించారు. నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, రాఘవేంద్రావు కెమెరా స్విచాన్‌ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు