'ఎఫ్2' లుంగీ స్టైల్.. వెంకీ, వరుణ్ ల మాస్ లుక్

Published : Jul 09, 2018, 04:17 PM IST
'ఎఫ్2' లుంగీ స్టైల్.. వెంకీ, వరుణ్ ల మాస్ లుక్

సారాంశం

తమ అభిమాన నటుడిని ఒక్కసారైనా లుంగీ స్టైల్ లో చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఒకే సినిమాలో వరుణ్, వెంకీ లుంగీతో మాస్ లుక్ తో కనిపించడం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది

'గురు' సినిమా తరువాత వెంకటేష్ మరో సినిమాను మొదలుపెట్టలేదు. మధ్యలో దర్శకుడు తేజతో ఓ సినిమా చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు. నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో అలానే వరుణ్ తేజ్ తో కలిసి మరో సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు వెంకటేష్. వరుణ్ తేజ్, వెంకీలు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాకు 'ఎఫ్2'(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.

తాజాగా వెంకీ ఈ సినిమా సెట్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా ఓ ఫోటో తీసిన చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో వెంకటేష్ లుంగీ కట్టుకొని ఉండడం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో వెంకీతో పాటు దర్శకుడు అనీల్ రావిపూడి అలానే నిర్మాత శిరీష్ కూడా ఉన్నారు. సరిగ్గా ఇదే టైపులో వరుణ్ తేజ్ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. లుంగీలో ఉన్న వరుణ్ తేజ్ తన మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం తెలుగునాట లుంగీ స్టైల్ కు ఆదరణ పెరుగుతోంది. తమ అభిమాన నటుడిని ఒక్కసారైనా లుంగీ స్టైల్ లో చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఒకే సినిమాలో వరుణ్, వెంకీ లుంగీతో మాస్ లుక్ తో కనిపించడం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కుటుంబ నేపధ్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్