పోలీసుల రాకతో హీరోయిన్ తో హీరోగారి పెళ్లి క్యాన్సిల్..

Published : Jul 09, 2018, 03:40 PM IST
పోలీసుల రాకతో హీరోయిన్ తో హీరోగారి పెళ్లి క్యాన్సిల్..

సారాంశం

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ కు నటి మదాలస శర్మతో నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. జూలై మొదటి వారంలోనే పెళ్లి కూడా జరగాల్సివుంది. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ కు నటి మదాలస శర్మతో నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. జూలై మొదటి వారంలోనే పెళ్లి కూడా జరగాల్సివుంది. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యువతి మహాక్షయ్ తనతో మూడేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని, అతడి కారణంగా తల్లినైతే అబార్షన్ చేయించాడని, ఇందులో అతడి తల్లి ప్రమేయం కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తల్లీకొడుకులకు శనివారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ తరువాత పెళ్లి జరిగే రోజున పోలీసులు విచారణ కోసం పెళ్లి వేదిక వద్దకు వెళ్లగా.. మదాలస శర్మ కుటుంబ సభ్యులు అక్కడ నుండి వెళ్లిపోవడంతో పెళ్లి ఆగిపోయిందని సమాచారం. నిజానికి ఈ కేసు గురించి తెలిసిన తరువాత కూడా మదాలస.. మహాక్షయ్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది.

దీంతో ఇరు కుటుంబసభ్యులు ఊటీలోకి వరుడి కుటుంబానికి సంబంధించిన ఓ హోటల్ లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించడానికి పోలీసులు హోటల్ కు చేరుకోవడంతో పరువు పోతుందని పెళ్లి కూతురిని తీసుకొని ఆమె తరఫు బంధువులు అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకనిర్మాత సుభాష్, నటి షీలా శర్మల కుమార్తె ఈ మదాలస శర్మ. ఈమె తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది.  

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు